' ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చే నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి '

by Batti.Sumithra |

అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దుచేయాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు, సంఘాల ప్రతినిధులు బషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ షాహీదా బేగంకు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు.

 ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా మార్చే నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి
X

దిశ, బషీరాబాద్ : అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ-ప్రైమరీ పాఠశాలలుగా మారుస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ, ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దుచేయాలని కోరుతూ అంగన్‌వాడీ టీచర్లు, సంఘాల ప్రతినిధులు బషీరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో స్థానిక తహసీల్దార్ షాహీదా బేగంకు శనివారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో అంగన్‌వాడీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని, ఈ నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రీ-ప్రైమరీ, పీఎం శ్రీ పథకాల కింద ఏర్పాటు చేసిన 4,131 కేంద్రాల నిర్ణయాన్ని పునఃసమీక్షించి, వాటిని తిరిగి అంగన్‌వాడీల ఆధ్వర్యంలో కొనసాగించాలని కోరారు. సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్) వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అంగన్‌వాడీ సిబ్బందికే అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బాలమణి, శోభారాణి, వాణిశ్రీ, మొగులమ్మ, లలిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story