రైతులకు ఇష్టంలేని ఎరువులను బలవంతంగా అంటగట్టొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి

by Nallavelli.Anjaneyulu |

రైతులు ఏ ఎరువులు కోరితే వాటినే వారికి అమ్మాలని, దుకాణా దారులు తమకు నచ్చిన ఎరువులను రైతులకు బలవంతంగా అమ్మకూడదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎరువుల దుకాణా యజమానులకు సూచించారు.

రైతులకు ఇష్టంలేని ఎరువులను బలవంతంగా అంటగట్టొద్దు : కలెక్టర్ ఇలా త్రిపాఠి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రైతులు ఏ ఎరువులు కోరితే వాటినే వారికి అమ్మాలని, దుకాణా దారులు తమకు నచ్చిన ఎరువులను రైతులకు బలవంతంగా అమ్మకూడదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎరువుల దుకాణా యజమానులకు సూచించారు. ఈ మేరకు కలెక్టర్ శనివారం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. జిల్లాలోని ఎరువుల దుకాణాలు, వివిధ సంస్థల ద్వారా యూరియా, ఇతర ఎరువులు కొనే రైతులకు వారి అంగీకారం లేకుండా వేరే ఏ రకమైన ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయకూడదని హెచ్చరించారు. యూరియా ఎరువులు కొనుగోలు చేసేందుకు వచ్చే పలువురు రైతులకు నానో యూరియా కొనుగోలు చేయాలని కొంతమంది ఎరువుల దుకాణాదారులు, వివిధ సంస్థల వారు ఒత్తిడి చేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని ఆమె పేర్కొన్నారు. ఇలా యూరియా ఎరువులతో ముడిపెడుతూ ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులను బలవంతం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. రైతులు కోరిన ఎరువులను మాత్రమే వారికి అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తూ రైతులకు ఇష్టం లేని ఎరువులను వారిచే కొనుగోలు చేసేలా ఒత్తిడి చేస్తే తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

Next Story