- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
by Jakkula.Mamatha |
భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను భర్త కడతేర్చిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, దుండిగల్: భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భార్యను భర్త కడతేర్చిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంతోష(38), సంతోష్ కుమార్ చారి(44) భార్యాభర్తలకు 21 సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి వారు మేడ్చల్ జిల్లా, దుండిగల్ సర్కిల్, చర్చి గాగిల్లాపూర్ నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఈ నెల 5న ఇంట్లో నిద్రిస్తున్న భార్య తలపై భర్త గొడ్డలితో మోదీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన తప్పు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్ కు పంపినట్లు దుండిగల్ సీఐ పి.సతీష్ తెలిపారు.
Next Story






