గాంధీ ఆసుప‌త్రి గేట్ వ‌ద్ద క‌త్తితో దాడి.. వ్య‌క్తికి తీవ్ర‌గాయాలు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-06-06 11:58:57  IST  )

గాంధీ ఆసుప‌త్రి గేట్ వ‌ద్ద ఓ వ్య‌క్తి పై క‌త్తితో దాడి చేసిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

గాంధీ  ఆసుప‌త్రి గేట్ వ‌ద్ద క‌త్తితో దాడి.. వ్య‌క్తికి తీవ్ర‌గాయాలు
X

దిశ‌, సికింద్రాబాద్ : గాంధీ ఆసుప‌త్రి గేట్ వ‌ద్ద ఓ వ్య‌క్తి పై క‌త్తితో దాడి చేసిన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. గుంటూరుకి చెందిన సుమారు 45 ఏళ్ల వ్య‌క్తి పై మ‌రో వ్య‌క్తి శ‌నివారం క‌త్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆ వ్య‌క్తి చేతుల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన గాంధీ ఆసుప‌త్రి భ‌ద్ర‌తా సిబ్బంది వెంట‌నే బాధితుడినీ ఎమ‌ర్జెన్సీ వార్డుకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ను చికిత్స పొందుతున్నాడు. కుటుంబ విభేదాలే కార‌ణ‌మైన‌ట్టు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఆసుప‌త్రికి చేరుకొని వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

Next Story