రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ.. మంత్రి పదవి కోసమేనా?

by Ajay Maddhiboyina |

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాహుల్ గాంధీతో దిగిన ఫోటోను షేర్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఢిల్లీలో మా లీడర్‌ను కలిశాను.. అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.

రాహుల్ గాంధీతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ.. మంత్రి పదవి కోసమేనా?
X

దిశ‌, వెబ్ డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. రాహుల్ గాంధీతో దిగిన ఫోటోను షేర్ చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఢిల్లీలో మా లీడర్‌ను కలిశాను.. అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే తెలంగాణలో మంత్రివర్గవిస్తరణ జరగబోతుంది అంటూ వార్తలు వస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసమే రాజీవ్ గాంధీని కలిశారు అంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డికి కేబినెట్ బెర్త్ ఖాయం అని ఆయన అభిమానులు అంటున్నారు.

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరవాత రాజగోపాల్ రెడ్డి మంత్రిపదవిని ఆశించారు. కానీ ఆయనకు మంత్రివర్గంలో చోటుదక్కలేదు. దానికి కారణం ఆయన కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరి మళ్లీ కాంగ్రెస్ లోకి రావడమే అనే ప్రచారం జరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం తానే అసలైన కాంగ్రెస్ వాదినని చెప్పుకొచ్చారు. అలా అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. అనేకసార్లు తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా ప్ర‌భుత్వంపైనా విమ‌ర్శ‌లు కురిపించారు. ఇక ఇప్పుడు మ‌రోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై వార్త‌లు వ‌స్తున్న స‌మ‌యంలో రాహుల్ గాంధీతో భేటీ అవ్వ‌డంతో కోమ‌టిరెడ్డి కోరిక ఈసారైనా నెర‌వేరుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Next Story