బెజ్జూర్ రేంజ్‌లో పోడు భూముల లొల్లి

by Jakkula.Mamatha |

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో లుంబినగర్ గ్రామాల్లో అటవీ అధికారులకు, పోడు రైతులకు గొడవ జరిగింది.

బెజ్జూర్ రేంజ్‌లో పోడు భూముల లొల్లి
X

దిశ, బెజ్జూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో లుంబినగర్ గ్రామాల్లో అటవీ అధికారులకు, పోడు రైతులకు గొడవ జరిగింది. శనివారం బెజ్జూర్ ఇంచార్జి ఎఫ్ఆర్వో శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు రెబ్బన శివారులో కందకాలు తవ్వడానికి ట్రాక్టర్లతో వెళ్లారు. తాము సాగు చేసుకుంటున్న భూములు అటవీ అధికారులు కందకాలు తవ్వడం ఎంతవరకు సమంజసమని, భూమినే నమ్ముకొని జీవిస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభ సమయంలో పోడు లొల్లి ప్రారంభమవుతుంది. ఏడాది బెజ్జూర్ రేంజ్ పరిధిలోని రెబ్బెన శివారులో సర్వే నెంబర్ 96లో 237 ఎకరాల భూమిలో 80 మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. 2010 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలిచ్చింది.

పోడు భూముల్లో త్రీఫేజ్ కరెంట్ లైన్, 9 బోర్లు వేసి 40 సంవత్సరాలుగా తమ భూములను సాగు చేసుకుంటున్నామని తుమ్మలగూడెం సర్పంచ్ కొండ రాంప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు బెజ్జూర్ రేంజ్ అటవీ అధికారులను అడ్డుకున్నారు. 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు కందకాల తీయడం ఎంతవరకు సమంజసమని రైతులకు అన్యాయం జరుగుతుందని సర్పంచ్ రాంప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తను సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిచ్చిందని కందకాలు తాగడం అన్యాయం అన్నారు. అటవీ శాఖ అధికారుల వద్ద ఏం ఆధారాలున్నాయని, కందకాలు తవ్వేందుకు వచ్చారని ప్రశ్నించారు. అటవీ భూమని ఏం ఆధారం ఉందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Next Story