- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్చకు సిద్ధంగా ఉన్నా.. రండి: వెనిగండ్ల రాము సవాల్
గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.4.77 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ..

దిశ, వెబ్ డెస్క్: గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. గుడివాడ హెడ్ వాటర్ వర్క్స్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో రూ.4.77 కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెనిగండ్ల రాము తెలిపారు. ప్రతిపక్షాల నిరాధార విమర్శలను ప్రజలు పట్టించుకోవడం లేదని, తాము కూడా వాటిని లెక్కచేయబోమని స్పష్టం చేశారు. గుడివాడ ప్రజలకు దీర్ఘకాలికంగా సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న సంపు పూర్తయితే హెడ్ వాటర్ వర్క్స్ సామర్థ్యం గణనీయంగా పెరిగి సుమారు 55 వేల కుటుంబాల అవసరాలను తీర్చగలదన్నారు. ప్రస్తుతం పట్టణంలో సుమారు 35 వేల కుటుంబాలు ఉన్నాయని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.
మేం స్పందించాల్సిన అవసరం లేదు...
గత ప్రభుత్వ హయాంలో పూర్తికావాల్సిన పలు పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, ప్రస్తుతం వాటిని పూర్తి చేసే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలపై తమ దృష్టి కేంద్రీకృతమైందని, వ్యక్తిగత విమర్శలకు తాము స్పందించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొట్టిపారేశారు.






