- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాట నిలబెట్టుకున్న మంత్రి నిమ్మల: పేద కుటుంబానికి సొంత ఇంటి కల సాకారం!
పాలకొల్లు బ్రాడీపేటలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఉప్పే పెద్దింట్లు, గంగులులకు చెందిన ఇంటి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వీరి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు...

దిశ, పాలకొల్లు: పాలకొల్లు బ్రాడీపేటలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఉప్పే పెద్దింట్లు, గంగులులకు చెందిన ఇంటి నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. వీరి సొంత ఇంటి కల నెరవేర్చే దిశగా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా ఇంటి నిర్మాణం పూర్తయ్యే దిశగా సాగుతున్నాయి. శనివారం జరిగిన ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను మంత్రి రామానాయుడు స్వయంగా పరిశీలించారు. పని చేస్తున్న కార్మికులతోనూ మాట్లాడారు.
2024 ఎన్నికల సమయంలో పెద్దింట్లు ఇంటికి వచ్చిన మంత్రి నిమ్మల పాడైన తాటాకు ఇంట్లో ఉంటున్న పరిస్థితిని చూసి చలించి కూటమీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటి నిర్మాణం చేయించే బాధ్యత నాదంటూ మాట ఇచ్చారు. నేడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా ఇటీవల శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టించారు. ఈ పనుల్లో ఆయన శ్రమదానం కూడా చేశారు. ఇచ్చిన పిలుపుని అందుకొని పార్టీ శ్రేణులు నిర్మాణ పనుల్లో శ్రమదానం చేశారు. త్వరలో ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసుకునేలా ముస్తాబు కానుంది.






