SIRపై మాజీ ఎమ్మెల్యే హఫీన్ ఖాన్ కీలక పిలుపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-06 12:39:28  IST  )

ఎస్ఐఆర్‌పై రాష్ట్రంలో తొలిసారి మాట్లాడిన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌నేనని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. మ్యాపింగ్‌, డాక్యుమెంట్ స‌బ్మిష‌న్ SIRలో ముఖ్యమైన ప్రక్రియ అని, 2002 ఓట‌ర్ లిస్టు, 2025 ఓట‌ర్ లిస్టులో మ‌న ఓట్లను ప‌రిశీలించుకోవాలని ఆయన సూచించారు...

SIRపై మాజీ ఎమ్మెల్యే హఫీన్ ఖాన్ కీలక పిలుపు
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఐఆర్‌(SIR)పై రాష్ట్రంలో తొలిసారి మాట్లాడిన నాయ‌కుడు వైఎస్ జ‌గ‌నేనని(Ys Jagan) మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్(Former Mla Hafeez Khan) అన్నారు. మ్యాపింగ్‌, డాక్యుమెంట్ స‌బ్మిష‌న్ SIRలో ముఖ్యమైన ప్రక్రియ అని, 2002 ఓట‌ర్ లిస్టు, 2025 ఓట‌ర్ లిస్టులో మ‌న ఓట్లను ప‌రిశీలించుకోవాలని ఆయన సూచించారు. రెండింటిలో ఓటు ఉంటే బీఎల్‌వోల‌ను క‌లిసి ఎన్యుమ‌రేష‌న్ ఫామ్ పూర్తి చేసి పాస్‌పోర్టు ఫొటోతో అప్లికేష‌న్ పూర్తి చేయాలని హఫీజ్ ఖాన్ తెలిపారు. ఒక‌వేళ 2002 నాటికి ఓట‌ర్‌గా న‌మోదు కాని వారు కుటుంబ స‌భ్యుల ఓట్ల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. 2002లో ఏ నియోజక‌వ‌ర్గం, ఏ బూత్‌‌లో ఓటు ఉందో వెత‌క‌డ‌మే క‌ష్టమైన ప్రక్రియ‌ అని చెప్పారు. 2002, 2025లో ఓట్లు లేని వారు సెల్ఫ్ ఎన్యుమ‌రేష‌న్ చేసుకుని కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలని హఫీన్ ఖాన్ పిలుపునిచ్చారు.

వైసీపీ ట్వీట్

Next Story