- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆరే మాస్టర్ మైండ్.. ఫోన్ ట్యాపింగ్ పై ఎంపీ చామల సంచలనం
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. విచారణ పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. విచారణ పూర్తైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనను ఈ రోజు బాధితుడిగా పిలిచినా.. 2023లోనే తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని తెలిపారు. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ గా ఉన్న సమయంలోనే తన ఫోన్ ను ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. ఆ సమయంలో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డికి దగ్గరగా ఉండటం వల్లే తన ఫోన్ ను ట్యాప్ చేశారన్నారు. 2023 జూలై 30వ తేదీ నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకూ రాష్ట్రంలో కీలక నేతలందరి ఫోన్లు ట్యాప్ నకు గురయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి ఫోన్లనూ ట్యాప్ చేసి.. ఎన్నికల విషయాలను తెలుసుకునేవారని ఆరోపించారు.
అయినా సొంత కుటుంబంలో ఉన్నవారి ఫోన్లనే ట్యాప్ చేయించిన కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్, బండి సంజయ్, తన ఫోన్లను ట్యాప్ చేయించడం ఒక లెక్కే కాదన్నారు. హరీష్ రావు ఫోన్ ను కూడా ట్యాప్ చేయించారని, ఆయన ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పరన్నారు. విషయం తెలిసిన వెంటనే తన డ్రైవర్, పీఏలను మార్చారని ఎంపీ చామల పేర్కొన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ ను మించినవారు లేరని, ఎప్పటికీ తానే అధికారంలో ఉండాలన్న దురుద్దేశంతోనే అందరి ఫోన్లను ట్యాప్ చేయించారని ఆరోపించారు.






