- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RBI: కెనరా బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ జరిమానా
వైసీతో పాటు మరికొన్ని నిబంధనలను పాటించనందుకు రూ. 41.8 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: నిబంధనల ఉల్లంఘనల కారణంగా కెనరా బ్యాంక్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. కేవైసీతో పాటు మరికొన్ని నిబంధనలను పాటించనందుకు రూ. 41.8 లక్షల జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 నాటికి బ్యాంక్ ఆర్థిక స్థితిపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా, కొంతమంది కస్టమర్ల ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) రికార్డులను గడువులోగా సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (సీకేవైసీఆర్)లో అప్‌లోడ్ చేయడంలో బ్యాంక్ విఫలమైనట్లు ఆర్‌బీఐ గుర్తించింది. కేవైసీ ప్రక్రియ బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత, మోసాల నివారణకు కీలకమైన నేపథ్యంలో ఈ లోపాలను నియంత్రణ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. అంతేకాకుండా కొన్ని ఖాతాల్లో చివరి కస్టమర్ లావాదేవీ జరిగి ఏడాది కూడా పూర్తికాకముందే వాటిని ‘ఇనాక్టివ్’ ఖాతాలుగా వర్గీకరించినట్లు కూడా ఆర్‌బీఐ తనిఖీల్లో తేలింది. అయితే ఈ జరిమానా పూర్తిగా నిబంధనలను పాటించడంలో గుర్తించిన లోపాలకు సంబంధించినవేనని, సంస్థలు తమ కస్టమర్లతో చేసిన లావాదేవీలపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.






