దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం

by Jakkula.Mamatha |

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది.

దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం
X

దిశ, మధిర: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా మధిర మండల పరిధిలోని దెందుకూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనడంతో ఐదుగురు ప్రమాదానికి గురయ్యారు. ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం మధిర నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో మూడు సంవత్సరాల వయసు ఉన్న చిన్న పాప తాళ్లూరి భవాని, తాళ్లూరి చంద్ర ఉన్నారు.

Next Story