- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : ఈ నెలాఖరులో రెండు మల్టీ డే మ్యాచ్‌ల కోసం భారత ‘ఏ’ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది. ఈ టూరుకు బీసీసీఐ శనివారం భారత ‘ఏ’ జట్టును ఎంపిక చేసింది. ఈ జట్టులో తెలుగు కుర్రాడు షేక్ రషీద్‌కు చోటు దక్కింది. రషీద్‌ది ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా. ఆంధ్ర జట్టులో రషీద్ కీలక సభ్యుడు. ఈ ఏడాది జనవరిలో విదర్భతో జరిగిన రంజీ మ్యాచ్‌లో(132 నాటౌట్) అజేయ శతకం బాదాడు. బెంగాల్‌పై 46 రన్స్ చేయగా.. 4 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక పర్యటనలో భారత ‘ఏ’ జట్టుకు ధ్రువ్ జురెల్ కెప్టెన్. సాయి సుదర్శన్, పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా జట్టులో ఉన్నారు. జూన్ 25 నుంచి జూలై 5 మధ్య రెండు మల్టీ డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత ‘ఏ’ జట్టు
ధ్రువ్ జురెల్(కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుశ్ పాండే, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబె, సరన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, అకీబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, జగదీసన్, అమన్ మోఖడే, షేక్ రషీద్, జీషన్ అన్సారీ






