- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయడం హర్షణీయం
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయడం పట్ల తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది.

X
దిశ, హిమాయత్ నగర్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని అమలు చేయడం పట్ల తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కృష్ణ, కన్వీనర్ పీ రాజేష్ మాట్లాడుతూ.. న్యాయ వాదులకు హెల్త్ ఇన్సూరెన్స్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు పెంచాలని కోరారు. ప్రతి జిల్లో అర్హులైన ఇంటి స్థలాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. యువ న్యాయవాదులకు వృత్తి రీత్యా కావాల్సిన మౌలిక సదుపాయాలకు 50 వేలు నగదు ప్రోత్సాహకం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో కో కన్వీనర్ విజయ్ సురేశ్, వైస్ ప్రెసిడెంట్ ఎం. వినోద్ కుమార్, న్యాయవాదులు విజయకుమారి, హేమంత్ కుమార్ పాల్గొన్నారు.
Next Story






