- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే నా లక్ష్యం: పాడి కౌశిక్ రెడ్డి
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ,హుజూరాబాద్ రూరల్: హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన, లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్వయంగా అందజేశారు. మండల పరిధిలోని కాట్రపల్లి, పెద్ద పాపయ్యపల్లి, కందుగుల, ధర్మరాజుపల్లి, జూపాక, చెల్పూర్, రంగాపూర్, పోతిరెడ్డి పేట గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఈ ఆర్థిక సహాయం అందించారు.
పేదలకు అండగా సీఎంఆర్ఎఫ్..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. అనారోగ్యం, ఇతర ఆపద సమయాల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. తమ ఇళ్ల వద్దకే వచ్చి ఆర్థిక సాయం అందించినందుకు లబ్ధిదారులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కొండల్ రెడ్డి, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డిలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






