- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫుట్ పాత్ ఆక్రమణలపై చర్యలేవి..?
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణల పై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ, ఘట్కేసర్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో ఫుట్ పాత్ ఆక్రమణల పై చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ నెలలో నారపల్లిలో మజీద్ నుంచి ఎం.జి.ఆర్ వరకు పుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు పనులు ప్రారంభించి, ఫుట్ పాత్ లు ఆక్రమిస్తే చర్యలు తప్పవని షాపు యజమానులు ముందస్తుగా ఆక్రమణలు స్వతహాగా తొలగించుకోవాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి హెచ్చరించారు. రోడ్డుకు ఇరువైపుల ఫుట్ పాత్ పై ఉన్నటువంటి షాపు యజమానులు పాదాచారులకు ఎలాంటి ఆటంకాలు కలిగించినా జరిమానా విధిస్తామని డీసీ తెలిపారు. ఫుట్ పాత్ ఆక్రమణల తొలగింపు పై ఒక్క రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మున్సిపల్ అధికారులు ఆ తర్వాత ఆక్రమణల తొలగింపు పై దృష్టి సారించలేదు. మున్సిపల్ అధికారుల తీరు ఆరంభ శూరత్వమేనని దుకాణ యజమానులు పుట్ పాత్ ఆక్రమణల స్వచ్ఛందంగా తొలగింపు విషయంలో పెద్దగా పట్టించుకోలేదు.
పాదచారులకు తప్పని తిప్పలు..
అన్నోజిగూడ, ఘట్కేసర్, యంనంపేట, వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ప్రధాన రహదారి పక్కన ఫుట్ పాత్ ఆక్రమణలు విపరీతంగా పెరిగిపోయాయి. ఫుట్ పాత్ పై హోటళ్ళు వెలిశాయి. ప్రకటన బోర్డులు, ఇతర సామాగ్రితో పుట్ పాత్ లు నింపేస్తున్నారు. ఇక ఘట్కేసర్ లో రోడ్డు విస్తరణలో భాగంగా ఫుట్ పాత్ లపై దుకాణాలను తొలగిస్తే అదే చోట మళ్ళీ దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా ఘట్కేసర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రహారీ గోడ పక్కనే ఉన్న దుకాణాలు, పట్టణంలో ఫుట్ పాత్ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించకపోవడంతో హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ ఆర్ డి సి) సంస్థ 100 అడుగుల వెడల్పు రోడ్డు అభివృద్ధి పనులను సరిగా పూర్తి చేయలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు సర్కిల్ పరిధిలోని ఫుట్ పాత్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.






