- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మర్పల్లిలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ఎస్సీ కార్పొరేషన్ భవనంలోని టిఫిన్ సెంటర్
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, మర్పల్లి : వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్సీ కార్పొరేషన్ భవన సముదాయంలోని ఒక టిఫిన్ సెంటర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మర్పల్లి మండల కేంద్రంలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన వాణిజ్య సముదాయంలో ఒక టిఫిన్ సెంటర్ నడుస్తోంది. శనివారం ఉదయం టిఫిన్ సెంటర్ వద్ద వినియోగదారులు రద్దీగా ఉన్న సమయంలో, ఒక్కసారిగా భవనం భాగాలు కుప్పకూలాయి. శబ్దంతో భవనం కూలడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల కింద నలుగురు చిక్కుకుపోయారు. పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టి, శిథిలాల కింద చిక్కుకున్న నలుగురిని క్షేమంగా బయటకు తీశారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం మర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. గాయపడిన వారిలో మర్పల్లికి చెందిన ఇద్దరు బాలలు ఒక బాలిక , కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?
కొంతకాలంగా ఈ భవనం శిథిలావస్థకు చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భవనం ప్రమాదకరంగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దినిపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.






