వరి కొయ్యలను కాల్చిన రైతుకు రూ.5వేల జరిమానా

by Jakkula.Mamatha |

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాంతండా గ్రామంలో వరి కొయ్యలు (పంట అవశేషాలు) కాల్చిన భూక్యా నంద్య నాయక్ అనే రైతుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రూ.5,000 జరిమానా విధించారు.

వరి కొయ్యలను కాల్చిన రైతుకు రూ.5వేల జరిమానా
X

దిశ, కథలాపూర్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాంతండా గ్రామంలో వరి కొయ్యలు (పంట అవశేషాలు) కాల్చిన భూక్యా నంద్య నాయక్ అనే రైతుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి రూ.5,000 జరిమానా విధించారు. పంట అవశేషాలను పొలాల్లో కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు నేల సారవంతం తగ్గిపోతుంది. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాజారాంతండా గ్రామంలో వరి కొయ్యలను కాల్చిన ఘటనను గుర్తించిన గ్రామ కార్యదర్శి సంబంధిత రైతుపై రూ.5,000 జరిమానా విధించినట్లు సమాచారం. కాగా అధికారులు రైతులు పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ ఎరువుల తయారీ, మల్చింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించాలని సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి యోగిత, గ్రామ సర్పంచ్ భూక్యా తిరుపతి నాయక్, పంచాయతీ కార్యదర్శి నరేష్, తదితరులు ఉన్నారు.

Next Story