సేవ్ ద టైగర్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్ సినిమా!

by Chukka Sudharani |

మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు.

సేవ్ ద టైగర్ డైరెక్టర్‌తో సాయి ధరమ్ తేజ్ సినిమా!
X

దిశ, సినిమా: మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘హనుమాన్’ ఫేమ్ కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తు్న్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ రోహిత్ కె.పి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న సాయి ధరమ్ తేజ్.. అప్పుడే తన తదుపరి ప్రాజెక్టును కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు 'సేవ్ ద టైగ‌ర్స్' ఫేమ్ తేజ కాక‌మాను ద‌ర్శక‌త్వంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ఈ చిత్రానికి 'పరు వేట‌' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖ‌రారు చేశారట. 'ప‌రువేట' అనేది అహోబిలంలోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ప్రతీ ఏటా జ‌రిగే ఉత్సవం. ఈ ఉత్సవానికి విశిష్టమైన‌ చారిత్రక, సాంస్క్రృతిక నేప‌థ్యం ఉంది. ఈ నేపథ్యం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తుండగా.. పరువేట అనే టైటిల్ ఖారారు చేసినట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు జ‌రుగుతుండగా.. త్వర‌లోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Next Story