- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆర్.కే. భూపాల్ నియామకం
తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆర్.కే. భూపాల్ ని నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్ నియామక పత్రాన్ని జారీ చేశారు.

దిశ, సీతాఫలమండి : తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆర్.కె. భూపాల్ ని నియమిస్తూ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డా. చీమ శ్రీనివాస్ నియామక పత్రాన్ని జారీ చేశారు. తెలంగాణ ఉద్యమంలో అర్. కె.భూపాల్ అందించిన సేవలను గుర్తించి, ఉద్యమ కారుల సంక్షేమం, సంస్థ బలోపేతం, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కారుల సమస్యల పరిష్కారానికి మరింత సమర్థవంతంగా సేవలందించాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డా. చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసిన నాయకులకు సంస్థలో తగిన గుర్తింపు ఇవ్వడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అర్ కె భూపాల్ తన అనుభవంతో ఉద్యమ కారుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియామకం పై స్పందించిన ఆర్.కె. భూపాల్ , తన పై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమ కారుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సంస్థ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. రాష్ట్రంలోని ఉద్యమ కారులందరినీ ఒకే వేదిక పైకి తీసుకువచ్చి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విశేష సేవలందించిన అర్ కె భూపాల్ కి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల పలువురు ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.






