అడవిలో జయశంకర్ బడిబాట.. ఉపాధ్యాయుల ఐడియా అదుర్స్!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.

అడవిలో జయశంకర్  బడిబాట.. ఉపాధ్యాయుల ఐడియా అదుర్స్!
X

దిశ, ఖానాపూర్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేయడం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సుర్జాపూర్ గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అడవిలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు చేర్పించాలని కోరారు. అయితే.. ప్రతిరోజు ఉదయం గ్రామంలో ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లగా గ్రామంలోని ప్రజలు ఉపాధి కూలీలకు వెళ్లడంతో ప్రజలు ఇంటి వద్ద ఉండకపోవడంతో అడవిలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న ఉపాధి కూలీల వద్దకు వెళ్లాలని ఆ ఉపాధ్యాయులు నిర్ణయించారు.

ఈ తరుణంలోనే ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ తో ఉపాధి హామీ పని వద్దకు వెళ్లి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరడంతో ఉపాధ్యాయుల ఐడియా అదుర్స్ అని కొందరు కొనియాడారు. ప్రధానోపాధ్యాయుడు వి.మునీందర్ రాజు, గ్రామ సర్పంచ్ ఆబక్కశెట్టి వెంకట్ రాములు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతను వివరిస్తూ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం తో అనేక సౌకర్యాలు ఉంటాయని వారు వివరించారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియం బోధనలు చేస్తారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు డి.శ్రీనివాస్, శ్రీనివాస్, వార్డు సభ్యులు బొమ్మేన రాకేష్, తోకల గంగన్న, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story