- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీకు తెల్లమ్మాయి కావాలా.. భారతీయుడిపై జాత్యహంకార వేధింపులు
ఇటీవల కాలంలో భారతీయులపై జాత్యహంకార వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా ఓ భారతీయ జంట ఫోటో దిగుతుంటే పక్కనే ఉన్న అమెరికన్ వారిని దూషించడం మొదలు పెట్టాడు.

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భారతీయులపై జాత్యహంకార వేధింపులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్‌గా ఓ భారతీయ జంట ఫోటో దిగుతుంటే పక్కనే ఉన్న అమెరికన్ వారిని దూషించడం మొదలు పెట్టాడు. మీకు అమెరికా అంటే ఇష్టమా, ఇండియా అంటే ఇష్టమా.. మీ దేశానికి మీరు వెళ్లిపోండి అంటూ భూతులు తిట్టాడు. తాజాగా న్యూాయార్క్ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ భారతీయ యువకుడు తన అమెరికన్ ప్రియురాలితో కూర్చుని ఉండగా అక్కడకు వచ్చిన మరో అమెరికన్ అతడిని దూషించడం మొదలుపెట్టాడు. నీకు తెల్ల అమ్మాయి కావాలా అంటూ దుర్భాషలాడుతూ వేధింపులకు పాల్పడ్డాడు. శ్వేతజాతి మహిళతో కనిపించడమే అతడి ఆగ్రహానికి కారణం అని తెలుస్తోంది.
అంతే కాకుండా తానే తిడుతూ తానే వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు అమెరికన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశాల్లో జాత్యహంకార దాడులు పెరిగిపోతున్న వేళ ఆసక్తికర చర్చ జరుగుతోంది. భారతీయులు విదేశాల్లో అతి చేయడం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. విదేశాల్లో రోడ్లపై మన పండుగలు నిర్వహించడం, సినిమా థియేటర్లకు వెళ్లి గోల చేయడం వల్ల విదేశీయులు కోపం పెంచుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు భారతీయులు ఉద్యోగాలు పొందడం వల్ల తమకు ఉపాధి లభించదు అనే కారణంతోనే ఇలాంటి వివాదాలు తలెత్తుతున్నాయని కొందరు అంటున్నారు.






