మీకు మేమున్నాం.. బాధితుల‌కు స్పీక‌ర్ భ‌రోసా

by Nallavelli.Anjaneyulu |

వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో హోటల్ భవనం పై కప్పు కూలిన ఘటనలో గాయపడి సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం పరామర్శించారు.

మీకు మేమున్నాం.. బాధితుల‌కు స్పీక‌ర్ భ‌రోసా
X

దిశ, సంగారెడ్డి అర్బన్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల కేంద్రంలో హోటల్ భవనం పై కప్పు కూలిన ఘటనలో గాయపడి సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం పరామర్శించారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని సంగారెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. సంగారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చందన(12), తండ్రి చాద్రు, రమేష్(25), తండ్రి నరసింహులును స్పీకర్ కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఉత్తమ వైద్యం అందించండి


బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్ అనిల్ కుమార్, డీఎం అండ్ హెచ్‌ఓ లలితా దేవిలను స్పీకర్ ఆదేశించారు. అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించి, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ పరామర్శ

అనంతరం గోకుల్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం.డి. నజీర్(17), బాలాజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎం. శివకుమార్(25)లను స్పీకర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకొని, మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి యాజమాన్యాలను, డీఎంహెచ్‌ఓను కోరారు. బాధితులు త్వరగా కోలుకోవాలి. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం అని స్పీకర్ భరోసా ఇచ్చారు.

Next Story