YCP మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు 14 రోజుల రిమాండ్

by Prasad Jukanti |

గండిపేట ప్రభుత్వ భూముల కబ్జా కేసులో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

YCP మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు 14 రోజుల రిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు (Bolla Brahmanaidu) కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాలతో బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు జైలుకు తరలించారు. హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.వేల కోట్ల విలువైన 9.10 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేసేందుకు నకిలీ జీవోలు సృష్టించిన కేసులో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టు అయ్యారు. ఈ కేసులో గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న ఆయన్ను శుక్రవారం సైబరాబాద్ పోలీసులు తమిళనాడులోని కాంచీపురంలో అరెస్టు చేశారు. ఈ హై ప్రొఫైల్ అరెస్టు కోసం సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్, నార్సింగి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్ తరలించిన పోలీసులు ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో (Upparpally Court) ప్రవేశపెట్టగా ఈ నెల 20 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది.

ఆరుకు చేరిన అరెస్టులు:

కాగా ఈ కేసులో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుతో మొత్తం అరెస్టుల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ భూకబ్జాకు సంబంధించిన కేసును పలు కోణాల్లో సైబరాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా మరిన్నీ చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story