- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్
జూన్ 21న జిల్లాలో నిర్వహించనున్న నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు.

దిశ, ఆసిఫాబాద్: జూన్ 21న జిల్లాలో నిర్వహించనున్న నీట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హరిత అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ నితిక పంత్, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్ లతో కలిసి పాల్గొని జిల్లా అధికారులతో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. జూన్ 21న నిర్వహించే నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, జిల్లా కేంద్రంలోని జనకాపూర్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశలో ఉన్నందున తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే కేటాయించిన రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 9న హైదరాబాద్ లోని పరేడ్ మైదానంలో స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా బస్సులు పంపిణీ కార్యక్రమానికి జిల్లా నుంచి మండలానికి ఒక బస్సు చొప్పున 15 బస్సులలో స్వయం సహాయక సంఘాల మహిళలను తరలించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ కు బస్సులు సురక్షితంగా చేరుకునేలా పూర్తిస్థాయి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.






