- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తింపు లేని స్కూళ్లపై కొరడా ఝళిపించాలి: ABVP
by Jakkula.Mamatha |
రాష్ట్రంలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ డిమాండ్ చేశారు.

X
దిశ, ఇల్లంతకుంట: రాష్ట్రంలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ABVP రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంద వంశీకృష్ణ డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండానే పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. అనుమతులు లేని పాఠశాలలను సీజ్ చేసి, విద్యార్థులను గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ABVP ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Next Story






