- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలూరు మండలంలో ప్రీ-ప్రైమరీ ఇన్ స్ట్రక్టర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
పాఠశాల విద్యా సంచాలకులు, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఆలూర్ మండలంలోని ఆలూర్, కల్లడి, మాచర్ల, గుత్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు మంజూరు చేయబడినట్టు మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎం. నరేందర్ తెలిపారు.

దిశ, ఆలూర్ : పాఠశాల విద్యా సంచాలకులు, హైదరాబాద్ ఆదేశాల మేరకు ఆలూర్ మండలంలోని ఆలూర్, కల్లడి, మాచర్ల, గుత్ప ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు మంజూరు చేయబడినట్టు మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎం. నరేందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆలూర్ మండల విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు నమూనా తదితర పూర్తి వివరాలు సంబంధిత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 10 చివర తేదీగా నిర్ణయించినట్టు తెలిపారు. ప్రీ-ప్రైమరీ విద్యా విస్తరణలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియ ద్వారా చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటోందని ఎంఈఓ నరేందర్ తెలిపారు. మండలంలోని అర్హులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.






