- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుమతి పత్రాలు లేని ఇసుక ట్రాక్టర్ పట్టివేత
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ శివారులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు రాత్రి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్ఐ రాహుల్ రెడ్డి తెలిపారు.

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామ శివారులో అర్ధరాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు రాత్రి ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్ఐ రాహుల్ రెడ్డి తెలిపారు. శీతల నరేష్ చెందిన ట్రాక్టర్‌లో డ్రైవర్ అల్లెపు వంశీ అక్రమంగా అర్ధరాత్రి ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండానే అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నారని శనివారం వేకువజామున పట్టుకున్నారు. అనంతరం ఇసుక ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి ఓనర్, డ్రైవర్ లపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ అనుమతి పత్రాలు లేకుండా ఎవరైనా రాత్రి పూట, డే సమయంలో కానీ అక్రమంగా ఇసుకను తరలించినట్లయితే ట్రాక్టర్ ఓనర్ పై, డ్రైవర్లపై చట్టరీత్యా చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం అందిస్తున్న టోకెన్ విధానం ద్వారా ఇసుక రవాణా చేయాలని ఎస్సై కోరారు.






