- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగబాబును నిలబెట్టేందుకు అంతలా కష్టపడ్డ పవన్
నాగబాబును నిర్మాతగా మంచి స్థాయికి తీసుకువెళ్లడానికి పవన్ ‘టైగర్ సీతారాముడు’ అనే సినిమా ప్రారంభమైనప్పటికీ, భారీ బడ్జెట్ మరియు ‘జానీ’ ఫ్లాప్ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ – నాగబాబు ఇద్దరూ సొంత అన్నదమ్ములు అనే విషయం తెలిసిందే. నాగబాబు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘గుడుంబా శంకర్’. అయితే ఈ సినిమా కంటే ముందే వీరి కాంబినేషన్‌లో మరో సినిమా రావాల్సి ఉండగా, లాంచ్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరి ఆ సినిమా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ – నాగబాబు కాంబినేషన్‌లో ‘టైగర్ సీతారాముడు’ అనే సినిమా రూపొందాల్సి ఉంది. నాగబాబును నిర్మాతగా మంచి స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను పవన్ ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి దర్శకుడిగా వీర శంకర్‌ను ఎంపిక చేశారు. 2002లో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించగా, హీరోయిన్‌గా శ్రేయను తీసుకున్నారు.
ప్రేమలో విఫలమైన సీతారాముడు ఎలా ‘టైగర్ సీతారాముడు’గా మారాడనే కథాంశంతో సినిమాను రూపొందించాలనుకున్నారు. 2003 ఫిబ్రవరి 3న ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే భారీ బడ్జెట్ అవసరం కావడం, అదే సమయంలో పవన్ నటించిన ‘జానీ’ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో ‘టైగర్ సీతారాముడు’ ప్రాజెక్ట్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అదే బ్యానర్‌లో తక్కువ బడ్జెట్‌తో ‘గుడుంబా శంకర్’ను తెరకెక్కించారు. సినిమా పెద్ద విజయం సాధించకపోయినా, నాగబాబుకు కొంతవరకు ఆర్థికంగా ఊరటనిచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ ఉంది. నిర్మాతగా నాగబాబును నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది.






