Priya Hegde: చీరలో గ్లామర్ షో.. నడుము అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ

by Pulgam srinivas |

రెడ్ సారీలో అందాలను ఫుల్‌గా ఆరబోసిన ప్రియా హెగ్డే.

Priya Hegde: చీరలో గ్లామర్ షో.. నడుము అందాలతో ఆకట్టుకున్న బ్యూటీ
X

దిశ, వెబ్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకులకు ప్రియా హెగ్డే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన ఈ బ్యూటీ తెలుగులో ప్రసారమైన ‘కేరాఫ్ అనసూయ’ సీరియల్‌తో మంచి గుర్తింపును సంపాదించుకుంది.



నటనతో పాటు తన అందంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ అభిమానులతో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ, స్టైలిష్ ఫోటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది.




తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. గోల్డ్ కలర్ బార్డర్‌తో ఉన్న రెడ్ సారీ ధరించిన ప్రియా, దానికి మ్యాచ్ అయ్యే స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో స్టన్నింగ్ లుక్‌లో కనిపించింది.




చీర పవిటను కాస్త పక్కకు జరిపి, నడుము అందాలు హైలైట్ అయ్యేలా స్టైలిష్ యాంగిల్స్ లో కెమెరాకు ఫోజులు ఇచ్చింది. చేతికి వాచ్, గాజులు, మెడలో అందమైన హారం ధరించి మరింత ఎలిగెంట్ లుక్‌లో మెరిసింది.




అలాగే గాలికి వదిలేసిన ఆమె జుట్టు, మొత్తం లుక్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా ఈ ఫోటోల్లో ప్రియా హెగ్డే అందం మరింత హైలైట్ కావడంతో ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Photos Courtesy: Instagram

Next Story