- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో 'కాక్రోచ్ పార్టీ' భారీ నిరసనకు పోలీసుల అనుమతి.. కేంద్రమంత్రి రాజీనామాకు డిమాండ్!
నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈ వివాదాలపై జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో యువత భారీ ఆందోళన. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, అలాగే సీబీఎస్‌ఈ (CBSE) ఓఎస్ఎం వివాదాలపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టారు. ఈ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని నిరసనకారులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల అనుమతి - కాక్రోచ్ మాస్కులతో వినూత్న నిరసన
ఈ ధర్నా కార్యక్రమానికి ఢిల్లీ పోలీసులు అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. తాము చట్టాన్ని గౌరవిస్తూ, ఎటువంటి అల్లర్లకు తావులేకుండా పూర్తిగా శాంతియుత మార్గంలోనే తమ నిరసనను తెలియజేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులు స్పష్టం చేశారు. దీంతో నేడు సాయంత్రం ఐదు గంటల వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగనుంది. ఈ ఆందోళనలో పాల్గొంటున్న యువత అంతా వినూత్నంగా తమ పార్టీ గుర్తు అయిన 'కాక్రోచ్' (బొద్దింక) మాస్కులను ధరించి తరలిరావడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇదిలా ఉంటే ఉద్దేశపూర్వకంగా అల్లర్లు చేసేందుకు పలువురు ప్రయత్నిస్తారని ముందస్తు సమాచారం ఉండటంతో జంతర్ మంతర్ మొత్తం పోలీసుల నిఘా నీడలో ఉంది.






