- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Amaravathi:అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
అమరావతి చట్టబద్ధతకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అమరావతి చట్టబద్ధత తీర్మానంపై చర్చించిన సభ్యులు..

X
దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధతకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో అమరావతి చట్టబద్ధత తీర్మానంపై చర్చించిన సభ్యులు .. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజధాని అమరావతిలో నిర్మాణాలను 2028కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. ప్రధాని మోడీ సమక్షంలో రాజధాని భవనాలను ప్రారంభిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఏపీకి ఒకే ఒక్క రాజధాని ఉంటుందని. అదే అమరావతి అని చంద్రబాబు తెలిపారు. అమరావతి ద్రోహిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచిపోతుందని చెప్పారు. విభజన జరిగినప్పుడు కూడా బాధపడలేదన్నారు. కానీ వైసీపీ చేసిన కుట్రలు చూసి ఆవేదన చెందుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
Read More : జగన్ దుర్మార్గుడు .. మళ్లీ వైకుంఠపాళి ఆడొద్దు : ప్రజలకు అచ్చెన్న విజ్ఞప్తి
Next Story






