జగన్ దుర్మార్గుడు .. మళ్లీ వైకుంఠపాళి ఆడొద్దు : ప్రజలకు అచ్చెన్న విజ్ఞప్తి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-28 09:33:13  IST  )

జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బాగుచేయడం ఎవ్వరి తరం కాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.

జగన్ దుర్మార్గుడు .. మళ్లీ వైకుంఠపాళి ఆడొద్దు : ప్రజలకు అచ్చెన్న విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని నగరంగా అమరావతి నిర్మాణాన్ని ఆపి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న దుర్మార్గుడు జగన్ అని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. శనివారం అమరావతి చట్టబద్ధత తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదం తెలిపేందుకు ప్రత్యేకంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రజలు జగన్ కు ఓట్లేసి, సీఎంను చేసి తప్పు చేశారన్నారు. 2019లోనూ టీడీపీనే గెలిచి ఉంటే.. నేడు రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. 2014-19 కాలంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాజధాని కోసం శిల్పిలా కష్టపడ్డారన్నారు. అయినా.. రూ.లక్షకోట్లు అవినీతికి పాల్పడిన జగన్ కు ఓట్లేసి ఎన్నుకోవడం దారుణమన్నారు. జగన్ దుర్మార్గుడు అని అనకూడదు కానీ.. అనక తప్పడం లేదన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, ఆయనకు పదవులు అక్కర్లేదని, ఆయన తాపత్రయం అంతా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగకూడదంటే.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మళ్లీ వైకుంఠపాళి ఆట ఆడొద్దని నిండుసభలో చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. మళ్లీ వేరొకరు సీఎంగా వస్తే.. ఇక రాష్ట్రాన్ని ఎవ్వరూ బాగుచేయలేరన్నారు.

Next Story