- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటుండు.. మాజీ మంత్రి KTR సెన్సేషనల్ కామెంట్స్
సీఎం రేవంత్ రెడ్డి అనాలోచితంగా తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అనాలోచితంగా తుగ్లక్‌లా నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ కార్పొరేషన్ సాధాన కోసం చేపట్టి శాంతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్‌గా నామకరణం చేస్తే.. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ టీజీ మార్చిందన్నారు. దాంతో ఏవరి జీవితాలు మారాయో.. ఎవరికి ఆనంద కలిగిందో తెలియదని అన్నారు. తీసుకుంటున్న నిర్ణయాలు చారిత్రక నగరం సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఆయన పాలన ‘పిచ్చోడి చేతిలో రాయిలా’ మారిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సికింద్రాబాద్ (Secunderabad) ప్రజల ఆకాంక్షలకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన ‘శాంతి ర్యాలీ’ని ప్రభుత్వం అప్రజాస్వామికంగా అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
సికింద్రాబాద్ అస్తిత్వంపై దాడి..
చారిత్రక జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సికింద్రాబాద్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పుస్తకాల్లో చదువుకున్న తుగ్లక్ పాలనను ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో చూస్తున్నామని ఎద్దేవా చేశారు. అధికార చిహ్నాల మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను తొలగించడం వంటి చర్యల వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
అభివృద్ధి శూన్యం.. విధ్వంసం నిరంతరం
ఎన్నిలక సందర్భంగా ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు ఏళ్లుగా నగరంలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ (KCR) ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని, కానీ రేవంత్ రెడ్డి వాటిని మళ్లీ మార్చాలని చూడటం ప్రజలకు ఇబ్బందికరమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో వార్డులు, జోన్లను పెంచి నిధులు ఇచ్చి అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని ప్రభుత్వం భగ్నం చేయడం అన్యాయమని కేటీఆర్ మండిపడ్డారు. నిన్నటి వరకు శాంతి ర్యాలీకి అనుమతినిచ్చి, తెల్లవారేసరికి వేలాది మంది కార్పొరేటర్లను, నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా..? రాహుల్ గాంధీ ఈ అరాచక పాలనపై స్పందించాలని కేటీఆర్ అన్నారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, రాజ్యాంగబద్ధంగా కోర్టును ఆశ్రయించి మరీ ‘శాంతి ర్యాలీ’ని నిర్వహించి తీరుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సికింద్రాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా మారుస్తామని హామీ ఇచ్చారు. అక్రమంగా అరెస్టు చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజల అస్తిత్వంతో ఆడుకుంటే కాలమే సమాధానం చెబుతుందని కేటీఆర్ కామెంట్ చేశారు.
Read More..






