- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం BRS పోరు.. కాసేపట్లో KTR నేతృత్వంలో భారీ ర్యాలీ
సికింద్రాబాద్ చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి ఇవాళ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ (Secunderabad) చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని, ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation)గా చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) ఇవాళ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. ముందుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ పునర్విభజన వల్ల సికింద్రాబాద్ అస్తిత్వానికి ఎదురయ్యే ముప్పుపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకపక్షంగా చేస్తున్న ఈ విభజనను ప్రజా క్షేత్రంలో ఎండగట్టాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా సమాచారం.
కాగా, సరిగ్గా ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ (Rally) ప్రారంభమై క్లాక్ టవర్, ప్యారడైజ్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. ర్యాలీ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులను భారీగా మోహరించారు.
Read More..






