- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజ్యాంగ ఉల్లంఘన.. గవర్నర్ తీరుపై నిప్పులు చెరిగిన సీఎం సిద్దరామయ్య
కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సభలో ప్రసంగించకుండానే వాకౌట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) సభలో ప్రసంగించకుండానే వాకౌట్ చేశారు. దీంతో ఆయన తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Chief Minister Siddaramaiah) తీవ్రంగా మండిపడ్డారు. ప్రతి ఏటా అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం రాజ్యాంగ నిబంధన అని, అయితే మంత్రి మండలి ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని కాదని, గవర్నర్ తాను సొంతంగా తయారు చేసుకున్న ప్రసంగాన్ని చదవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్ చర్య భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 176, 163లను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, ఆయన తన రాజ్యాంగబద్ధమైన విధులను విస్మరించారని సిద్ధరామయ్య విమర్శించారు.
గవర్నర్ అనుసరించిన ఈ వైఖరిని నిరసిస్తూ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిరసనలకు సిద్ధమవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేబినెట్ నిర్ణయాలకు లోబడి ఉండాల్సిన గవర్నర్, నియమాలకు విరుద్ధంగా వ్యవహరించడంపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానాన్ని (సుప్రీంకోర్టు) ఆశ్రయించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ అనూహ్య పరిణామం కర్ణాటక రాజకీయాల్లో రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తుంది.
Read More..






