గవర్నర్లకు రాజ్యాంగబద్ధ అధికారాలుంటాయి.. బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-22 04:18:40  IST  )

దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వరుస వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

గవర్నర్లకు రాజ్యాంగబద్ధ అధికారాలుంటాయి.. బండారు దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్ల మధ్య వరుస వివాదాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. తమిళనాడు (Tamilnadu)లో అసెంబ్లీలో ఆమోదించించిన బిల్లులను పెండింగ్‌ పెడుతున్నారని స్టాలిన్ సర్కార్ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా, కర్ణాటక (Karnataka)లో రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సంప్రదాయబద్ధంగా చేయాల్సిన ప్రారంభోపన్యాసం చేయడానికి గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ (Governor Thawar Chand Gehlot) నిరాకరించడం హాట్ టాపిక్‌గా మారింది.

ప్రభుత్వం పంపిన ప్రసంగ పాఠంలో కొన్ని వివాదాస్పద అంశాలు ఉండటం, కేంద్రంపై విమర్శలు తలెత్తేలా కొన్ని గణాంకాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని లోక్‌‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వరుస వివాదాలపై హిమాచల్ ప్రదేశ్, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్లకు రాజ్యాంగబద్ధ అధికారాలుంటాయని అన్నారు. కేరళ, తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్లు ప్రసంగించకపోవడాన్ని వివాదం చేయవద్దంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు వెళ్లాలని బండారు దత్తాత్రేయ అన్నారు.

Read More..

కొత్త నిబంధనలతో వచ్చిన చిక్కులు.. భారీగా తగ్గనున్న ‘పీఎం కిసాన్’ లబ్ధిదారులు

Next Story