- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ముందా?: బీజేపీకి CM రేవంత్ సవాల్
‘ప్రజా పాలన - ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ప్రజా పాలన - ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం పుట్టారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. నిలువునా దోచుకున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు, మహిళలు, రైతులు అందరినీ ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రజలు ఛీ కొట్టిన తర్వాత.. బుద్ధి తెచ్చుకుని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్వం త్యాగం చేసి.. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపించారని అన్నారు.
బీజేపీకి సవాల్..
మరోవైపు.. రాష్ట్రానికి బీజేపీ చేసింది కూడా ఏం లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు రాగానే.. జాతీయ అధ్యక్షుడిని తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు. బడ్జెట్‌లో గాడిద గుడ్డు ఇచ్చాం.. తెలంగాణ ప్రజలు మనకు ఓట్లు వేయరు అని ఆ అధ్యక్షుడికైనా తెలియాలి కదా అని అన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. ముందుకు కాళేశ్వరం స్కామ్‌లో, ఫార్ములా ఈకార్ రేస్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అక్రమాల గురించి స్వయంగా ప్రధాని మోడీనే నిలదీసి.. ఇంకా ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకుంటూ రాజకీయాల్లో కొనసాగుతున్నారని అన్నారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం నిజం కాకపోతే మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును అరెస్ట్ చేయాలని సవాల్ చేశారు.
ఎల్బీ స్టేడియానికి రండి..
పదేళ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, పన్నెండు ఏళ్లలో దేశానికి బీజేపీకి చేసిన దానికంటే.. తాము రెండున్నరేళ్లలో ఎక్కువే చేశామని అన్నారు. 70 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఇందులో ఎవరికైనా అనుమానం ఉంటే.. ఎల్బీ స్టేడియానికి రావాలని.. అక్కడే వివరంగా చెబుతా అని సవాల్ చేశారు. సన్నబియ్యం ఇస్తున్నాం, విద్యార్థులకు కాస్కొటిక్ ఛార్జీలు పెంచినం, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌లు తీసుకొచ్చినం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నం, రైతులకు ఉచిత కరెంట్, రైతు బీమా, రైతు భరోసా, రైతు రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు ఇలా చెప్పుకుంటూపోతే అనేక పనులు రెండున్నరేళ్లలోనే చేసి చూపించామని అన్నారు.
ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరల వ్యవహారంలోనూ బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో భార్యా, భర్తలు మాట్లాడుకునే ఫోన్లు కూడా విన్నారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా తారలు.. ఎవరి ఫోన్లూ వదల్లేదు. మంది ఫోన్లు వినే వాడు మనిషేనా? అలాంటి మనుషులకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేస్తే.. మన కళ్లలో మన వేలుతో పొడుసుకున్నట్లు ఉంటుందని అన్నారు.






