- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వేములవాడకు వెళ్తే పదవి పొతది’: CM రేవంత్ షాకింగ్ కామెంట్స్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం చొప్పదండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘చొప్పదండికి వస్తుంటే.. ఆది శ్రీనివాస్ వేములవాడ (Vemulawada temple)కు రావాలని ఆహ్వానించారు. ఇది విన్న కొందరు.. వేములవాడకు వెళ్లొద్దు అని చెవిలో చెప్పారు. వేములవాడకు వెళ్లిన తర్వాత పదవి పోతుంది. ఇలా ఇప్పటికే చాలా మందికి జరిగింది అన్నారు. ఇది విని నేను షాక్ అయ్యా. అట్ల ఎందుకు జరుగుతది. నేను తప్పకుండా వెళ్తా.. అది తప్పు అని నిరూపిస్తా. గతంలో వేములవాడకు రూ.150 కోట్లు ఇస్తానని కేసీఆర్ ప్రకటించి మోసం చేశారు. అలా మనం చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.150 కోట్లు మంజూరు చేశాం. బ్రహ్మాండంగా ఇప్పుడు అక్కడ పనులు జరుగుతున్నాయి’ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఏపీ పెట్టుబడుదారులు ఎంత అడ్డంపడ్డా సోనియా తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఇచ్చి.. కేసీఆర్‌ను సీఎం చేస్తే రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలి.. ఆస్తులు సంపాదించుకున్నాడని విమర్శిచారు.
Read More... మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్‌ను అరెస్ట్ చేసే దమ్ముందా?: బీజేపీకి CM రేవంత్ సవాల్






