- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు మహబూబ్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : జిల్లాల పర్యటనలో భాగంగా నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగనుంది. తొలుత జిల్లాలోని జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలో RGUKT-IIIT ఎక్స్‌పాన్షన్ క్యాంపస్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
చివరగా బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ పర్యటన అనంతరం రాత్రికి సీఎం రేవంత్ రెడ్డి మేడారం చేరుకొని, ఆదివారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని.. మేడారంలోనే రేపు మంత్రులతో క్యాబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. కాగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొన్న సీఎం రేవంత్.. 10 ఏళ్లలో ఆదిలాబాద్ ను బీఆర్ఎస్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
Read More..






