- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీరు సహకరిస్తే మేమూ సహకరిస్తాం’.. నీళ్ల వివాదంపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని టీజీఐఐసీ ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరాలలోని టీజీఐఐసీ ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. సుజెన్ మెడికేర్ సంస్థ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని అన్నారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన అత్యద్భుతమైన వాతావరణం మన రాష్ట్రంలో ఉందని అన్నారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వం సైతం పాలసీలు రూపొందిస్తోదని వెల్లడించారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని చెప్పారు. ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలకు సీఈవోలుగా ఉన్నది మన దేశం వాళ్లే అని అన్నారు. ప్రపంచమే హైదరాబాద్ వైపు చూసేలా ఫార్మా రంగం వృద్ధి చెందిందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలంటే అనివార్యంగా ప్రయివేట్ రంగాన్ని ప్రొత్సహించాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు.
మీరు సహకరిస్తే.. మేమూ సహకరిస్తాం..
‘నీళ్ల విషయంలో రాజకీయ లబ్ధి చూడొద్దు. నీటి వివాదాలపై కొందరు కావాలని కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. పక్క రాష్ట్రాలతో గొడవలు పెట్టుకోవాలని తాము చూడటం లేదు. గొడవల కంటే పరిష్కారమే మాకు ఎక్కువ ముఖ్యం. దీని కోసం చర్చలు చేయడానికైనా సిద్ధం. తెలంగాణ ప్రాజెక్టులకు వారు సహకరిస్తే.. పక్క రాష్ట్రాల ప్రాజెక్టులకు మేము కూడా సహకరిస్తాము. పక్క రాష్ట్రాల సహకారం లేకుండా పోర్టులు వాడుకోలేం’ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.






