తెలంగాణతో నీళ్ల పంచాయితీ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-09 10:43:22  IST  )

నీళ్ల విషయంలో గొడవలొద్దని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు..

తెలంగాణతో నీళ్ల పంచాయితీ..  సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: నీళ్ల విషయంలో గొడవలొద్దని, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామ సభ (Rayavaram Village Sabha) లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు (Polavaram-Nallamala Sagar Project) అంశంపై ఆయన స్పందించారు. పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు తెలిపారు. గొడవలతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం ఉందన్నారు. 2019లో టీటీడీ ఓడిపోయి ఉండకపోతే 2021లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది అని చెప్పారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకెళ్లినప్పుడు సైతం తమను విమర్శించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పక్క రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు తాము సహకరించామని, ఏపీ ప్రాజెక్టులకు కూడా సహకరించాలని కోరుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Read More... ‘మీరు సహకరిస్తే మేమూ సహకరిస్తాం’.. నీళ్ల వివాదంపై CM రేవంత్ కీలక వ్యాఖ్యలు

Next Story