- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పరిస్థితులు ఎలా ఉన్నా.. ఎర్రజెండా తలవంచదు: CM రేవంత్
కమ్యూనిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కమ్యూనిస్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన సీపీఐ(CPI) శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఎంత కఠినంగా ఉన్నా.. ఏనాడూ ఎర్రజెండా తలవంచదు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం సాగిస్తోంది. రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా సుదీర్ఘ పోరాటం సాగించారు. సాయుధ పోరాటంలో నాలుగు వేలమంది కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కమ్యూనిస్టు వీరుల త్యాగాలతోనే నిజాం నుంచి విముక్తికి బీజం పడింది. అలాంటి కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఖమ్మం జిల్లాలో సీపీఐ శతాబ్ది సభ జరుగడం ఆనందకరమైన విషయం అని అన్నారు.
కమ్యూనిస్టుల స్ఫూర్తితోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడాం
కమ్యూనిస్టుల స్ఫూర్తితో గత అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధించామని తెలిపారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని అన్నారు. దున్నేవాడిదే భూమి అని కమ్యూనిస్టు పార్టీ నినాదం ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ నినాదం స్ఫూర్తితోనే కాంగ్రెస్ జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చిందని అన్నారు. ఇప్పుడా చట్టాన్ని మోడీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. బ్రిటీష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభజించు పాలించు అనేది బీజేపీ విధానమని విమర్శించారు. కాంగ్రెస్ అయినా, కమ్యూనిస్టులు అయినా ప్రజల మేలు కోరే పార్టీలు అని అన్నారు. మోడీపై మనం కలిసి యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కమ్యూనిస్టుల మద్దతుతోనే అని చెప్పారు. ప్రధాని మోడీ వచ్చి ప్రచారం చేసినా ఖమ్మంలో బీజేపీ ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవలేదు అని తీవ్ర విమర్శించారు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా ఖమ్మం అని తెలిపారు. రాబోయే రోజుల్లో సీపీఐ శ్రేణులకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.
READ MORE .....
మంత్రులపై వరుస కథనాలు.. మీడియాపై CM రేవంత్ సీరియస్
‘బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి.. నాయకులు గద్దెలు దిగాలి’: సీఎం రేవంత్ రెడ్డి






