మంత్రులపై వరుస కథనాలు.. మీడియాపై CM రేవంత్ సీరియస్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-18 11:29:33  IST  )

మంత్రులపై మీడియాలో వస్తున్న వరుస కథనాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే.

మంత్రులపై వరుస కథనాలు.. మీడియాపై CM రేవంత్ సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రులపై మీడియాలో వస్తున్న వరుస కథనాలు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy), ఐఏఎస్ అధికారినిపై ఓ పత్రికలో కథనం రావడం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. ఇది మరువకముందే బొగ్గు గనుల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంపై మరో కథనం వెలువడింది. దీంతో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీరియస్ అయ్యారు. ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియాపై ఫైర్ అయ్యారు. ‘మీకు మీకు పంచాయితీలు ఉంటే మీరే తేల్చుకోవాలి. కానీ మా మంత్రులపై తప్పుడు ప్రచారం చేసి బద్నామ్‌ చేయకండి. ఆధారాలు లేకుండా.. తప్పుడు కథనాలు రాస్తే ఇకనుంచి ఎంతటివారైనా ఉపేక్షించం’ అని హెచ్చరించారు. కాగా, ఇప్పటికే ఈ కథనాలపై సదరు మంత్రులు కూడా స్పందించి తప్పుడు వార్తలు అని కొట్టిపారేశారు. తాజాగా బొగ్గు గనుల వ్యవహారంలో తనపై తప్పుడు రాతలు రాశారని భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పత్రిక రాసింది పిట్టకథ, కట్టుకథలు అని ఆరోపించారు. ఆ పత్రికవి అభూత కల్పనలు అన్నారు. ఈ వార్త విషయంలో తాను, ఆ పత్రిక ఎండీ తేల్చుకుంటామని సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. దీంతో ఇప్పుడిది రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

READ MORE .....

నర్సింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి శుక్రాచార్యుడు పన్నాగాలు చేస్తుండు: సీఎం రేవంత్ రెడ్డి

Next Story