- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
నర్సింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. నేడు సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నర్సింగ్ విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. నేడు సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో కూసుమంచిలో 100 పడకల ఆస్పత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. దీంతో పాటు జేఎన్‌టీయూ కళాశాల, ముద్దులపల్లి మార్కెట్ యార్డ్ మరియు నర్సింగ్ కాలేజీని సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నర్సింగ్ కోర్స్ చేసినవారికి జపాన్, జర్ననీలో మంచి డిమాండ్ ఉందన్నారు. విద్యార్థులకు నర్సింగ్ కోర్స్ తో పాటు జపాన్, జర్మనీ నేర్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎడ్యుకేషన్, హెల్త్ కే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. అంతేకాకుండా మంత్రులపై మీడియాలో అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. సింగరేణిలో బొగ్గంతా మాయమైందని కొన్ని పత్రికలు రాస్తున్నాయని తమ ప్రభుత్వంలో అలాంటి అవకతవకలకు తావు ఉండదన్నారు. మీకు పంచాయితీలు ఉంటే మీరు మీరు తేల్చుకోవాలని కానీ మంత్రులపై తప్పుడు ప్రచారం చేసి బద్నామ్ చేసే పని చేయవద్దన్నారు. తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వార్త రాసే ముందు వివరణ అడగాలన్నారు.
READ MORE ....
ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి శుక్రాచార్యుడు పన్నాగాలు చేస్తుండు: సీఎం రేవంత్ రెడ్డి
‘బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి.. నాయకులు గద్దెలు దిగాలి’: సీఎం రేవంత్ రెడ్డి






