- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి.. నాయకులు గద్దెలు దిగాలి’: సీఎం రేవంత్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి..

దిశ, ఖమ్మం బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ నాయకుడు కేసీఆర్‌ను వంద మీటర్ల గోయ్యి తీసి పాతిపెట్టాలని, బీఆర్ఎస్ నాయకులు గద్దెలు దిగాలి... ఊళ్లల్లో ఆ పార్టీ దిమ్మెలు కూలాలని, అప్పుడే నందమూరి తారక రామారావుకు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నిజమైన నివాళులర్పించినవారమవుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్నేరు లింక్ కెనాల్, జేఎన్టీయూ, నర్సింగ్ కళాశాలలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలను చేసి ప్రసంగించారు.
వారి స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నాం..
సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్రంలో ఇద్దరు గొప్ప వ్యక్తులు సీఎంలుగా పనిచేశారని, వారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలని, పేదవారి కడుపునింపాలని రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం ప్రవేశ పెట్టిన ఎన్టీఆర్ ఒకరైతే.. రైతులకు ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు అందజేసిన రాజశేఖర్ రెడ్డి మరొకరని కొనియాడారు. వారిద్దరి స్ఫూర్తితోనే రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఉచితంగా సన్న బియ్యం రూపంలో అందజేస్తున్నామని, 24 గంటలపాటు రైతులకు, ప్రజలకు నిరంతర విద్యుత్ అందజేస్తున్నామని, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇస్తున్నామని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇచ్చామని, ఇంకా ఎవరైనా రేషన్ కార్డులేనివారికి అందజేయాలని ఆ శాఖ మంత్రికి సీఎం సూచించారు. త్వరలో భద్రాచలం రాములవారి మందిరాన్ని అయోధ్య రామమందిరాన్ని తలపించేవిధంగా చేస్తామని హామీ ఇచ్చారు.
రాక్షసుల గురువు కేసీఆర్..
శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని, గద్దె దిగాలని కారుకూతలు కూస్తున్నారని కేసీఆర్, కేసీఆర్, హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. భూ బకాసురులకు, కబ్జాదారులకు, హత్యలు చేసేటోళ్లకు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకునేటోళ్లకు రాక్షసులకు గురువులాగా కేసీఆర్ ఎర్రవెళ్లి ఫాంహూస్ ఉండి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో మారీచుడు, సుబాహుడు విష ప్రచారం చేస్తున్నారని వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించాడు. బీఆర్ఎస్ ను బొందపెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలిపారు.
నన్ను వివరణ అడగండి..
సింగరేణిలో కుంభకోణం జరిగిందని ఓ పత్రిక, చానెల్లో ఈ రోజు కథనం వచ్చిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేదని, అనవసరమైన ప్రచారం కల్పించి ప్రజలను గందరగోళానికి గురిచేయవద్దని, ఇలాంటి వ్యవహారాల్లోకి తమ మంత్రులను లాగొద్దని హెచ్చరించారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మీ రాతలు, చేతలు శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహులకు సహకరించే విధంగా ఉన్నాయని, రాసే ముందు తనను వివరణ అడగాలని సూచించారు. తమ నాయకుల మీద ఏ వార్త వచ్చినా వారికి నాయకునిగా తన మీద అపోహ కలుగుతుందని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రులు ఏకపాత్రాభినయం చేసేవారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరం సమిష్టిగా సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నామని, ఎలాంటి అవకతవకలకు చోటివ్వదని స్పష్టం చేశారు. మరోసారి తమ మంత్రులు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ జెండా ఎగరాలి...
తెలంగాణ వచ్చిన తర్వాత మూడుసార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క సీటు మాత్రమే ఇచ్చారని, పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారన్నారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని సూచించారు. కష్టాన్ని నమ్ముకుని పార్టీకోసం పనిచేస్తే తన లాగే ఎవ్వరైనా ఎదుగుతారని చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజానీకం బీజేపీని నిషేధించారని, ఆ నిషేధం కంటిన్యూ కావాలన్నారు. భవిష్యత్ మొత్తం కాంగ్రెస్ పార్టీదేనని, గతంలో పది సంవత్సరాలు తెలుగుదేశం, పదేళ్లు కాంగ్రెస్ర్టీ, పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని, 2023నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉంటుందని, రాములవారి సాక్షిగా తాను చెప్పేదే నిజమవుతుందన్నారు.
నాణ్యమైన విద్య, వైద్యానికి ప్రాధాన్యం..
నర్సింగ్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి నర్సింగ్ విద్యార్థినులతో ముచ్చటించారు. సమాజంలో వైద్యానికి, వైద్యునికి దేవుని మీద ఉన్న నమ్మకముందని, వమ్ము చేయవద్దని సూచించారు. వృత్తి ధర్మాన్ని పాటించి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలవాలని విద్యార్థులకు చెప్పారు.. ఇంజనీరింగ్ తో పాటు నర్సింగ్‌కు దేశ విదేశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉందని, జపాన్, జర్మనీల్లో అనేక అవకాశాలున్నాయని చెప్పారు.రానున్న కాలంలో ఇతరదేశాల లాంగ్వేజ్ టీచింగ్ కూడా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
వారికి ఒంటి నిండా విషమే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
బీఆర్ఎస్ నాయకులు ఒళ్లంత విషం పెట్టుకుని తమ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద, మంత్రుల మీద విషం చిమ్ముతున్నారని మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్, బై ఎలక్షన్, గ్రామపంచాయతీ ఎన్నికలను రెఫరెండమ్ అంటూ సాగిన బీఆర్ఎస్ ను చిత్తుచిత్తుగా ప్రజలు ఓడించినా బుద్ధిరాలేదని, ట్విట్టర్ టిల్లు కారుకూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించామని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ ప్రభుత్వం ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మున్నేరు లింక్ కెనాల్ పనులు, జేఎన్టీయూ కళాశాల నిర్మాణ పనులు, నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్ లో సీతారామ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగాల కల్పన కోసం భవిష్యత్తులో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామని వెల్లడించారు.
READ MORE .....






