ఈనెల 16 నుంచి సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్

by Muthe.Rajitha |   (  Updated:2026-01-14 03:49:48  IST  )

ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీగా ఉండనున్నారు.

ఈనెల 16 నుంచి సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 1 వరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస పర్యటనలతో బిజీగా ఉండనున్నారు. ఈ నెల 16న ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 17న మహబూబ్‌నగర్ జిల్లాకు వెళ్లి జడ్చర్ల IIITకు శంకుస్థాపన చేసి అక్కడ కూడా బహిరంగ సభ నిర్వహిస్తారు. 18వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించి పాలేరు నియోజకవర్గంలో జరిగే సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొంటారు. అదే రోజు ఖమ్మం పట్టణంలో సీపీఐ బహిరంగ సభలోనూ పాల్గొంటారు.

18వ తేదీ రాత్రి మేడారంలో మంత్రులతో కలిసి బస చేసి.. అక్కడే కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. 19న కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటారు. అదే రోజు రాత్రి మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి దావోస్ పర్యటనకు బయలుదేరతారు. ఈ నెల 20 నుంచి 23 వరకు జరిగే ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో సీఎం రేవంత్ బృందం పాల్గొంటుంది. 24న దావోస్ నుంచి అమెరికాకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఫిబ్రవరి 1న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.

READ MORE ....

సాగునీటి కష్టాలకు చెక్.. చనాక–కొరాటతో రైతాంగానికి ఊపిరి

Next Story