- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అజిత్ పవార్ మృతిపై సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘోర ప్రమాదంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేస్తూ, దీనిపై సమగ్రమైన, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం మమతా బెనర్జీ తన ట్వీట్‌లో "అజిత్ పవార్ మరణవార్త నన్ను కలిచివేసింది. ఈ ప్రమాదం వెనుక ఉన్న కారణాలను వెలికితీయాల్సిన అవసరం ఉంది.
"ఈ ప్రమాదం ఎలా జరిగింది? దీని వెనుక ఏదైనా సాంకేతిక లోపం ఉందా..? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయాలపై స్పష్టత రావాలి. ఈ ఘటనపై తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలి" అని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి హృదయవిదారక ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వాస్తవాలు బయటకు రావాలని ఆమె పేర్కొన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న అజిత్ పవార్ మృతిపై విచారణ జరపాలన్న మమతా బెనర్జీ డిమాండ్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పవార్ కుటుంబానికి సానుభూతి
అనుకోని విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకస్మాత్తుగా దూరమవ్వడం తీరని లోటు. ఆయన చిన్నాన్న శరద్ పవార్‌తో పాటు, అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని మమతా బెనర్జీ తన సందేశంలో తెలిపారు.
READ MORE .....






