- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రికార్డుల రారాజు.. రాజకీయాల 'దడ'.. అజిత్ పవార్ అప్రతిహత ప్రస్థానం
మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న అజిత్ పవార్ ఈ రోజు ఉదయం విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న అజిత్ పవార్ ఈ రోజు ఉదయం విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలతో పాటు, దేశారాజకీయాలకు తీరని లోటు గా మిగిలిపోయింది. మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆయన పూర్తి పేరు అజిత్ అనంతరావు పవార్ (Ajit Anantrao Pawar). ఆయన తన రాజకీయ జీవితాన్ని 1982లో సహకార రంగం ద్వారా ప్రారంభించారు. తన చిన్నాన్న, మరాఠా యోధుడు శరద్ పవార్ అడుగుజాడల్లో నడుస్తూ, అతి చిన్న వయసులోనే చక్కెర సహకార బోర్డు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991లో పుణె జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, తన పరిపాలనా దక్షతను చాటుకున్నారు. అదే ఏడాది బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచినప్పటికీ, కేంద్రంలో శరద్ పవార్‌కు అవకాశం కల్పించేందుకు తన పదవిని త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు.
అధికార పీఠం - 'డిప్యూటీ సీఎంగా రికార్డు
1991 నుంచి వరుసగా ఆరుసార్లు బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అజిత్ పవార్.. మహారాష్ట్ర రాజకీయాల్లో చెక్కుచెదరని పట్టు సాధించారు. నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక శాఖ వంటి కీలకమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వహించిన అజిత్ పవార్, రాష్ట్రంలో అత్యధిక కాలం ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించారు. వివిధ పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వాల్లో (కాంగ్రెస్-ఎన్సీపీ, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్, బీజేపీ-ఎన్సీపీ-శివసేన) ఆయన ఏకంగా ఐదుసార్లు డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.
ఎన్సీపీలో చీలిక- బాబాయ్‌తో విభేదాలు
శరద్ పవార్‌కు రాజకీయ వారసుడిగా ఎదిగిన అజిత్ పవార్‌కు, పార్టీలో సుప్రియా సూలే ప్రాధాన్యత పెరగడం మింగుడుపడలేదు. ఈ క్రమంలోనే 2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి అర్ధరాత్రి ప్రమాణ స్వీకారం చేసి సంచలనం సృష్టించారు. అయితే ఆ ప్రయత్నం విఫలమైనా, 2023లో తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఎన్సీపీని నిట్టనిలువునా చీల్చారు. ఏక్ నాథ్ షిండే - బీజేపీ ప్రభుత్వంలో చేరి, అటు పార్టీ పేరును, ఇటు గుర్తును (గడియారం) దక్కించుకుని చిన్నాన్న శరద్ పవార్‌కు గట్టి సవాలు విసిరారు.
నిర్దాక్షిణ్యమైన పరిపాలన - ప్రజా నేత
మహారాష్ట్రలో అజిత్ పవార్‌ను ఒక కఠినమైన టాస్క్ మాస్టర్‌గా అభివర్ణిస్తారు. క్రమశిక్షణ, సమయ పాలన, పని వేగంలో ఆయనకు సాటిలేరని పేరుంది. వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా, బారామతి అభివృద్ధిని తన భుజస్కంధాలపై మోస్తూ ఆ ప్రాంతాన్ని ఒక మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దారు. 2024 డిసెంబర్ నుంచి మరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, తనదైన శైలిలో పాలనను కొనసాగించారు.
సీఎం అవ్వాలనే కల తీరకుండానే..
మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంతో పేరుగాంచిన అజిత్ పవార్ ఏకంగా ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. కానీ ఎప్పటికైన సీఎం కావాలనే కల తీరకుండానే అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన మృతిపై రాజకీయ నాయకులతో పాటు బారామతి ప్రజలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
READ MORE .....






