బెంగాల్ శరణార్థులందరికీ పౌరసత్వం.. ఇది 'మోడీ గ్యారంటీ'

by Malleboina Mahesh |   (  Updated:2026-04-26 12:35:32  IST  )

"జనసంఘ్ పుట్టింది బెంగాల్ నుండే.. శరణార్థులందరికీ పౌరసత్వం ఇవ్వడం మోదీ గ్యారెంటీ!" - బంగగావ్ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం.

బెంగాల్ శరణార్థులందరికీ పౌరసత్వం.. ఇది మోడీ గ్యారంటీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (Bengal Assembly Elections) ప్రచారంలో స్పీడ్ పెంచారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేసుకుని కీలక ప్రాంతాల్లో భారీ సభలు నిర్వహిస్తు ఓటర్లకు హామీలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం బంగగావ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ (Prime Minister Modi) భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. గంగానది గంగోత్రిలో జన్మించినట్లు, భారతీయ జనతా పార్టీకి మూలమైన జనసంఘ్ బెంగాల్ గడ్డపైనే పుట్టిందని ఆయన గుర్తుచేశారు. విభజన సమయంలో శరణార్థుల పక్షాన నిలిచిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారసత్వాన్ని బీజేపీ కొనసాగిస్తోందని, శరణార్థి కుటుంబాల బాగోగులు చూసుకోవడం భారతదేశ చారిత్రక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.

శరణార్థులందరికీ పౌరసత్వం కల్పించడం తన బాధ్యత అని పేర్కొంటూ, పౌరసత్వ సవరణ చట్టం (CAA) యొక్క ప్రాధాన్యతను మోడీ ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా మతువా, నమఃశూద్ర వంటి శరణార్థి కుటుంబాలకు శాశ్వత చిరునామా, పౌరసత్వ పత్రాలు, భారతీయ పౌరుడికి ఉండే అన్ని రాజ్యాంగపరమైన హక్కులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. "ఇది మోదీ గ్యారెంటీ" అని భరోసా ఇస్తూ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పౌరసత్వ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని ప్రకటించారు. విపక్షాలు శరణార్థులను భయపెడుతున్నాయని మండిపడుతూ, వారి భవిష్యత్తుకు బీజేపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఇచ్చారు.

అణురంగంలో చారిత్రక విజయం.. డిజిటల్ జనగణనపై ప్రధాని మోదీ కీలక పిలుపు

Next Story